Followers

ప్రజల ఆరోగ్యం కోసమే ఓపెన్ జిమ్ ల ఏర్పాటు

 ప్రజల ఆరోగ్యం కోసమే ఓపెన్ జిమ్ ల ఏర్పాటు...

 ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్


ఆదిలాబాద్ ,  పెన్ పవర్ 

ఆదిలాబాద్ పట్టణ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు మున్సిపల్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఓపెన్  జిమ్ లను ఏర్పాటు చేస్తోందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని గాంధీ పార్క్, 12వ వార్డు న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓపెన్ జిమ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఆయా వార్డుల్లో మొత్తం 10 ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం కైలాస్ నగర్ ప్రాంతంలోని గాంధీ పార్క్,12వ వార్డు లోని న్యూ హౌసింగ్ బోర్డు, విద్యానగర్, జీఎస్ కాలనీలో పనులు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. మిగతా ఆరు ఓపెన్ జిమ్ లను వచ్చే వారం లోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమాలు 12వ కౌన్సిలర్ పవన్ నాయక్, రమెల్లి శ్రీలత, రాంకుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...