ఐ సి డబ్ల్యు డి సంస్థ ద్వారా గ్రామీణ మహిళలకు చేయూత
తాళ్ళూరు,పెన్ పవర్తాళ్ళూరు మండలం లోని నాగంబొట్లపాలెం గ్రామంలో క్రాస్ సంస్థ మరియ ఐ సి డబ్ల్యు డి ఎస్ సంస్థ సారధ్యంలో గ్రామీణ వికాస్ బజార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రాస్ సంస్థ ప్రతినిధి కృపా సత్య మాట్లాడుతూ గ్రామీణ మహిళల అభివృద్ధి కొరకు గ్రామీణ వికాస్ బజార్లు ఎర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే గ్రామంలోని మహిళలకు పది మంది గ్రూప్ కలిపి పది వేల రూపాయల చొప్పున వంద మందికి సూక్ష్మ రుణాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిని నిత్యావసర సరుకుల రూపంలో ఇచ్చి వాయిదా పద్ధతిలో వడ్డీ లేకుండా చెల్లించాలని గ్రూపు సభ్యులకు తెలిపారు. గ్రామంలోని మహిళలు లోను పొందడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు అభివృద్ధి కోసం క్రాస్ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో క్రాస్ సంస్థ ప్రతినిధి కృపా సత్యం సర్పంచ్ చిమాట సుబ్బారావు, వైస్సార్సీపీ నాయకులు సోము అనిల్ రెడ్డి,కె.నరసింహా రెడ్డి,కల్పనా ,గోపి కృష్ణ ,మోపురి విజయలక్ష్మి ,కె.వాణి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment