కళా తపస్వి 'కళా'దరుడికి ఘన సత్కారం
ప్రపంచరంగస్థలంరోజునవండర్ బుక్ అఫ్ ఇంటర్నేషనల్ అవార్డు బహుకరణ.
నెల్లికుదురు, పెన్ పవర్
ప్రపంచ రంగస్థలదినాన్ని పురస్కరించుకొని మూడు రోజులుగా హైదరాబాద్ రవీంద్రబారతి లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న కళా సంస్కృతిక ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్ మరియు సీనియర్ కళాకారిణి రోజారమణి చేతులమీదుగా వండర్ బుక్ అఫ్ రికార్డు అవార్డు అందుకోవడం జరిగిందని మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన డాక్టర్ ఆదూరి కళాదర్ రాజు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ గత యాబై సంవత్సరాలనుండి తాను పౌరాణిక, జానపద కళలను ప్రోత్సహించడం వలన ముఖ్యంగా తాను అల్లూరిసీతారామరాజు నాటకంలో నటించిన అల్లూరిసీతారామరాజు క్యారెక్టర్ ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడం వలన నాకు ఈ ఆరుదైన గౌరవం దక్కిందని ఈ విదంగా గ్రామీణ ప్రాంతాలలోని కళాకారులను గర్తించి వారిని ఒకే వేదిక మీదికి తెచ్చి సన్మానించడం శుభపరిణామమని తెలంగాణ సంగీత నాటక అకాడమీని కొనియాడారు. మరియు నాకు ఈ గుర్తింపు లభించడానికి దొహదపడిన వర్ధన్నపేట భరతీయ నాటక కళాసమితికి శ్రీరామగిరి వివేకానంద సంస్కృతిక సమితికి కళలను ఆప్యాయతతో ఆదరించిన శ్రీరామగిరి గ్రామ ప్రజలకు కళాసుమాంజలులు తెలియజేస్తున్నానన్నారు.
No comments:
Post a Comment