Followers

నేడు ప్రజా సంక్షేమ పాలన వచ్చిందని ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు

నేడు ప్రజా సంక్షేమ పాలన వచ్చిందని ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు


విజయనగరం,పెన్ పవర్

నేడు ప్రజా సంక్షేమ పాలన వచ్చిందని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం నాడు వార్డు పర్యటనలో భాగంగా 25 వ డివిజన్ వసంత విహార్, కాపు వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతమైన వసంత విహార్ లో కనీస వసతులు కొరవడ్డాయి అని ఆ ప్రాంత వాసులు ఎమ్మెల్యే కోలగట్ల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోలగట్ల శానిటరీ ఇన్స్పెక్టర్  వివరణ అడిగారు. అయితే గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్నవారు ప్రత్యేకమైన చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకుని ప్రధాన గేటు వద్ద వాటిని తరలించినట్లు అయితే ఆ చెత్తను తీసుకు వెళ్లే అవకాశం ఉందని శానిటరీ ఇన్స్పెక్టర్ వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలనీవాసులు సకాలంలో పనులు కడతారని వారికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వసంత విహార్ ప్రాంగణంలో విద్యుత్ లైట్లు లేవు అని ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగిందని, రేపటిలోగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రధాన పైపులైన్ ద్వారా ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్నికల హామీలు లో ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. సామాన్యుని పాలన ఏ విధంగా ఉంటుందో క్రియా రూపంలో చూపిస్తున్నాము అన్నారు. వార్డు ఇంచార్జ్ ఎడ్ల రాజేష్ మాట్లాడారు. ఈ పర్యటనలో, పార్టీ నగరపాలక అధ్యక్షులు ఆసాపు వేణు, కార్పొరేటర్లు ఎడ్ల కృష్ణవేణి, కేదారి శెట్టి సీతారామమూర్తి, డివిజన్ పార్టీ నాయకులు, వసంత విహార్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...