Followers

రైతు సంక్షేమ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం...

 రైతు సంక్షేమ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం...

అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి,  అదిలాబాద్ జిల్లా కేంద్రంలో పాల సేకరణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తో కలిసి ప్రారంభించిన మంత్రి

 ఆదిలాబాద్ , పెన్ పవర్ 

 దేశంలో లేనటువంటి పథకాలతో రాష్ట్ర రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పాడి రైతుల సౌకర్యార్థం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తో కలిసి 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించరు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రు.30 కోట్ల అప్పులో ఉన్న విజయ డైరీని రు.60 కోట్ల మిగులు బడ్జెట్ కు తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర విజయ డెయిరీ ఛైర్మెన్ లోక భూమారెడ్డి గారిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో రైతులకు సబ్సిడీ పైన పాడి పశువులను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా అధికారులు, పట్టణ వార్డు కౌన్సిలర్ లు, తెరాస నేతలు, జిల్లా పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...