ఇంపార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గూడెం కోత్తవీధి,పెన్ పవర్
మిలిసియా సభ్యునిగా పని చేసి లొంగిపోయిన గిరిజనున్నిఇంపార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు.విశాఖ మన్యంలోని జికెవిది మండలం కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామానికి వచ్చిన సాయుధ మావోయిస్టులు ఇంట్లో నిద్రిస్తున్న కొర్ర పిల్కు అనే గిరిజనుడ్ని బయటకు తీసుకువచ్చి గొడ్డలితో నరికి చంపారు.ఆ సమయంలో అడ్డుకున్న భార్యమిత్తు ని కొట్టడంతో చేతిపై గాయమైంది. ఈయన మిలిసియా సభ్యుడిగా పనిచేస్తూ లొంగిపోయి పోలీసుఇంపార్మర్ గా మారినట్లు మావోయిస్టు పార్టీ గాలికొండ ప్రాంతీయ కమిటీ పేరుతోసంఘటన స్థలంలో ఒక లేఖ వదిలివెళ్లారు.గ్రామాల్లోవుంటూ మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేసి కుంబింగ్ చేయించేవారని అందులో పేర్కొన్నారు.ప్రజాకోర్టు పెట్టి హెచ్చరించిన పద్ధతి మార్చుకోకపోవడంతో శిక్ష విధించామని తెలిపారు.పిల్కు కి భార్య ,నలుగురు పిల్లలు ఉన్నారు.( ఫోటో : పిల్కు మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య,పిల్లలు.
No comments:
Post a Comment