Followers

కోమార్బిడిటితో బాధపడేవారు కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసుకునేందుకు డాక్టర్ అనుమతి తప్పనిసరి...

 కోమార్బిడిటితో బాధపడేవారు కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసుకునేందుకు డాక్టర్ అనుమతి తప్పనిసరి...



డాక్టర్ రెడ్డి కుమారి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

పెన్ పవర్,మల్కాజిగిరి 

 కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసుకోవడానికి వచ్చే కోమార్బిడిటి వ్యాధిగ్రస్తులు గుర్తింపు పొందిన వైద్యునిచే ధ్రువ పరచిన పత్రం తీసుకురావాలని నేరేడ్మెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి  డాక్టర్ రెడ్డి కుమారి సూచించారు. కిడ్నీ, డయాబెటిస్, ఊపిరితిత్తులు, హెచ్ఐవి, హృద్రోగ సమస్యలు, క్యాన్సర్, రక్త హీనత, వ్యాధి నిరోధక శక్తి, కాలేయ, చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడే కోమార్బీ డీటి వ్యాధిగ్రస్తులు గుర్తింపు పొందిన వైద్యుని అనుమతితో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు తప్పనిసరిగా పొందాలన్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారు టీకాలు పొందవచ్చన్నారు. కోవిడ్ టీకాలు వేయించు తెలిసినవారు ముందుగా ఆరోగ్య సేతు యాప్ లో పేరు, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరోగ్య కేంద్రంలో ప్రతి రోజు ముందుగా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్య సేతు యాప్ లో పేరు నమోదు చేసుకోకుండా నేరుగా ఉదయం 9 గంటల సమయంలో నేరేడ్మెట్ ఆరోగ్య కేంద్రం కు ఆధార్ నెంబర్లు తో వెళ్లిన వారి పేర్లను అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బంది నమోదు చేసుకొని టీకాలు ఇవ్వడం జరుగుతుంది. టీకాలు వేసుకున్న వారిని ఆస్పత్రిలోని రెస్ట్ రూమ్ లో అరగంటపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుకొని ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు. కోవిడ్ టీకాలు వేసుకునేందుకు ఆరోగ్య కేంద్రం కు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కు తప్పని సరిగా ధరించి రావాలని డాక్టర్ రెడ్డి కుమారి సూచించారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్మెట్ మాతృ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ టీకాలు ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి  సాయంత్రం 4 గంటల వరకు వేస్తున్నట్లు డాక్టర్ రెడ్డి కుమారి పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...