Followers

విశాఖలో వేడెక్కిన రాజకీయాలు

 విశాఖలో వేడెక్కిన రాజకీయాలు 

విశాఖ తూర్పు,పెన్ పవర్

సొంత నియోజకవర్గంలో వైసీపీ జాయినింగ్స్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమయ్యింది.విశాఖలో రాజకీయాలు వేడెక్కాయి. సొంత నియోజకవర్గంలో వైసీపీ జాయినింగ్స్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమయ్యింది.   బుదవారం  ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా అనుచరుడు కాశీవిశ్వనాథం వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు కానీ మంత్రి అవంతి హాజరుకాకపోవడంపై వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కాశీ విశ్వనాథం జాయినింగ్‌ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల నిర్ణయం ముఖ్యం కాదని.. పార్టీ బలోపేతమే ము‌ఖ్యమని వ్యాఖ్యానించారు. అయితే గంటా అనుచరుడు విశ్వనాథం వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరే కించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...