సీపీఐ అధ్వర్యంలో బంద్ విజయవంతం గా నిర్వహించారు
ఎటపాక,పెన్ పవర్ఎటపాక మండలంలో శుక్రవారం సిపిఐ అధ్వర్యంలో భరత్ బంద్ విజయవంతం గా నిర్వహించారు.కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఉద్యమానికి శుక్రవారం నాటికి నాలుగు నెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు సంపూర్ణ భారత్ బంద్‌కు శుక్రవారం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎటపాక మండలం లో సీపీఐ అధ్వర్యంలో విద్య సంస్థలు, బ్యాంక్ లు, సచి వాలయాలు , బైక్ ర్యాలీ నిర్వహించి మూసివేయించి నారు. భరత్ బంద్ మద్దతుగా ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించారు. సందర్బంగా మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రవేటికరణ ఆపాలని అన్నారు. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలన్నారు. నాలుగు లేబర్ కోడ్ లని ఉప సంహరించుకోవాలన్నరు. అవసరమైన ప్రజలకు ఆహార, ఆర్ధిక మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఆపా లన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎలిశాలా నాగరాజు, సహాయ కార్యదర్శి వాసం రాము, వరదా బ్రహ్మం, కంటే రాజు, పసుపులేటి ముత్తయ్య, మై పా సాయి, పసుపులేటి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment