లాసన్స్ బే కోలని లో నూతన ఫిజియోధేరపీ క్లినిక్ ప్రారంభం
విశాఖ తూర్పు, పెన్ పవర్
నగరంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన నూతన ఫిజియోధేరపీ క్లినిక్ ప్రారంభం అయింది.లాసన్స్ బే కోలని పోస్టాఫీస్ మార్గంలో గీతాస్ ఫిజియోధేరపీ నేడు ఘనంగా ప్రారంభమైంది.ప్రారంభోత్సవానికి ముఖ్యాతిదులుగా గీతం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య పిఎస్ రావు,కేజిహెచ్ విశ్రాంత విభాగాదిపతి డాక్టర్ ఉదయ్ కుమార్ లు విచ్చేశారు.ముందుగా దీపప్రజ్వలన గావించి క్లినిక్ ని అతిదులు ప్రారంభించారు.ప్రముఖ వైద్యనిపుణులు,సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సిహెచ్ ఉదయ్ శంకర్ ఆద్వర్యంలో నిర్వహించనున్న క్లినిక్ ప్రత్యేకతలను అతిదులు అడిగితేలుసుకున్నారు.అత్యాధినిక పరిజ్ఞానంతో పాటుగా నిష్ణార్ధులైన వైద్య నిపుణులతో చికిత్స అందించనున్న క్లినిక్ అంతర్జాతీయ ప్రణాళికతో ఉందని అతిదులు కొనియాడారు.శరీర స్థితిగతులను సరియైన అంచనా వేసి వ్యాదుల నిర్మూలనకు అవసరమైన ఫిజియోధేరపీ వైద్య విధానంతో చికిత్స అందించనున్నామని నిర్వాహికులు తెలిపారు.రోగుల శారీరక స్థితిగతులను తెలుసుకోవడానికి వారితో కలిసి వారి వ్యవహారశైలి,ఆహారపు అలవాట్లు గుర్తించి వారి బౌతీక స్థితికి అనుగుణంగా అత్యున్నతమైన వైద్యం అంధించే క్లినిక్ నగరవ్యాప్తంగా ఎక్కడాలేదని తొలిసారిగా గీతాస్ క్లినిక్ ద్వారానే పరిచయం చేస్తున్నామని తెలిపారు.సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో చికిత్స అందించేలా టారిఫ్ రూపకల్పన చేశామని నిర్వాహికులు తెలిపారు.ఇంతటి ఉత్తమ వైద్యం అందిస్తున్న గీతాస్ క్లినిక్ భవిష్యత్తులో మరింత వృద్ది చెంది మరిన్ని శాఖలుగా విస్తరించాలని అతిదులు ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహికులతో పాటుగా పలువురు వైద్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment