Followers

గుండె పోటుతో భక్తురాలు మృతి

 గుండె పోటుతో  భక్తురాలు మృతి...

వేములవాడ,  పెన్ పవర్

తలపై బోనo ఎత్తుకుని బద్దిపోచమ్మ కు మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరిన ఓ భక్తురాలు ఆలయ సమీంలోకి రాగానే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన మంగళవారం వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం (మం) ఎదులపల్లి గ్రామానికి చెందిన కడుగూరి పూలమ్మ (60) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాజన్న దర్శనార్థం వేములవాడకు వచ్చారు. రాజన్న దర్శనం  చేసుకుని ఆలయ  పరిసర ప్రాంతాల్లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం  పోచమ్మకు బోనo వండి  మొక్కులు చెల్లించుకునేందుకు  తలపై బోనం పెట్టుకొనిపోచమ్మ ఆలయానికి బయలు దేరింది. ఆలయ సమీంలోనికి రాగానే తలపై బోనంతో సహా ఒక్కసారిగా కుప్పకూలి గుండె పోటు తో మరణించింది. ఈ మేరకు  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...