మహిళలకు ఘన సన్మానం
కూకట్ పల్లి,పెన్ పవర్
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగిపోవాలి అని జైభారతమాత సేవ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లద్దే నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి కే.పీ.హెచ్.బి కాలనీ భాగ్యనగర్ కాలనీలోని జైభారతమాత సేవ సమితి కార్యాలయంలో మహిళా దినోత్సవని పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సమాజంలో ఇంకా వివక్షకు గురవుతున్నారని, రోజు ఎక్కడో ఒక చోట స్త్రీలపట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మహిళలకు సముచిత స్థానం కల్పించే దిశగా ముందుకు సాగాలి అని వారు సూచించారు. ఒకప్పుడు ఇంట్లో ఉండే మహిళలు ఇప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాలు నడిపే స్థాయికి ఎదిగారని, ఇకపైన కూడా మగవాళ్లకు దీటుగా మరింత ముందుకు సాగాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మినీ రాథోడ్ జై భారత మత సేవ సమితి మహిళ ప్రెసిడెంట్, పోలిన సుబ్బారావు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఎర్రవలి ప్రభాకర్ రావు జనరల్ సెక్రటరీ, విఠల్, మహేష్ గౌడ్, నరసమ్మ, స్వరూప గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment