ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాలు పంపిణీ
వైద్యాధికారి డాక్టర్ రవి
చిన్నగూడూరు, పెన్ పవర్స్థానిక మండల కేంద్రంలోని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నాడు కరోనా టీకా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ 40 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు కరోనా టీకాను వేయడం జరిగిందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కరుణ నియంత్రణలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్ ఉపయోగించుకోవాలని అన్నారు. రోగనిరోధక శక్తిని పెంచే మరియు ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని, పరిశుభ్రమైన దార్థాలను తీసుకుంటూ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఎస్తేర్ రాణి, నర్సు బాయ్, వనిత, హెల్త్ అసిస్టెంట్ ధర్మేందర్, ఆశ ఆరోగ్య కార్యకర్తలు జ్యోతి, అనిత , కల్పన ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment