మోతుగూడెంలో బంద్ విజయవంతం
మోతుగూడెం,పెన్ పవర్
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా మరియు ప్రభుత్వ సంస్థలను ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం భరత్ బంద్ కు పిలుపునిచ్చారు, ఈ దీనికి సంఘీభావంగా మోతుగూడెం గ్రామంలో చేపట్టిన బంద్ విజయవంతం అయింది, ఈ బంద్ లో టిడిపి, సిపిఎం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు,ఈ సందర్భంగా మన్యం లో జెన్కో ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మరియు గ్రామస్థులు బంద్ కు సంపూర్ణ మద్దతు పలికారు, ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బిజెపి ప్రభుత్వం రైతులపై తీసుకొచ్చిన చట్టాలను మరియు ప్రభుత్వరంగానికి చెందిన పరిశ్రమలను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తుందని దీనిని మనం అపకపోతే మన ప్రాంతంలో ఉన్న సీలేరు కాప్లెంక్స్ కోడ తన అధీనంలోకి తీసుకోని ప్రైవేటీకరణకు అడుగు లు వేస్తాడని అన్నారు, భారతదేశంలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ రంగమే సరైనా విధానమని రిజర్వేషన్లు తదితర బలహీన వర్గాల ప్రయోజనాలను రద్దు చేయడానికి ప్రవేటికరణను ముందుకు తెచ్చిందని నలబై సంవత్సరాలుగా కార్మికులు, ప్రజ కృషితో అభివృద్ధి చెందిన విశాక ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా కార్పోరేట్ వర్గాలకు అప్పగించలని చూస్తుందని అన్నారు,ఈ రాష్ట్ర బంద్ విజ్ఞప్తి మేరకు పాఠశాలలు, కార్యలయలు ముసివేయించారు మరియు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసి వేసారు.ఈ కార్యక్రమంలో తెలుగు దేశం, కాంగ్రెస్ మరియు సిపిఎం పార్టీలకు చెందిన నాయకులు వేగి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, దేముడు మరియు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment