డంపింగ్ యార్డ్ కు నిప్పు అంటుకొని కమ్ముకు పోయిన పొగ..
నూకాలమ్మ కాలనీలో ప్రజలు ఆందోళన
డంపింగ్ యార్డ్ దూరంగా తరలించాలని కోరిన పట్టించుకోని అధికారులు
వి.మాడుగుల,పెన్ పవర్
మాడుగుల నూకాలమ్మ కాలనీలో శుక్రవారం డంపింగ్ యార్డ్ తగులబడి పొగ కమ్మేసింది. పొగ తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నూకాలమ్మ కాలనీకి ఆనుకొని డంపింగ్ యార్డ్ ఉంది గ్రామంలో చెత్తంతా డంపింగ్ యార్డ్ లో వేయడం వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు తలెత్తుతుందని స్థానికులు వాపోతున్నారు. సంపద తయారీ కేంద్రం అసంపూర్తిగా ఉండిపోవడంతో చెత్తాచెదారం డంపింగ్ యార్డ్ లో వేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కడో ఒక చోట నిప్పు అంట్టుకొని పొగ కాలనీలోకి సొర పడుతుందని పొగ తీవ్రతకు వృద్ధులు పసిపిల్లలు ఊపిరాడక అస్వస్థతకు గురి అవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డ్ లో తరచూ నిప్పు అంటుకుని పొగ ప్రభావంతో నానా అవస్థలు గురవుతున్నామని డంపింగ్ యార్డ్ కు దూరంగా మార్చాలని ఎన్నిమార్లు ఫిర్యాదు చేసిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ స్పందించి డంపింగ్ యార్డ్ ని తరలించాలని లేనిపక్షంలో ఆందోళనలు సిద్ధంగా ఉన్నామని స్థానికులు హెచ్చరించారు.
No comments:
Post a Comment