Followers

చల్ల చల్లగా..

 చల్ల చల్లగా..

వేసవిలో పెరిగిన కులర్స్.ఏసీ విక్రయాలు.....

మార్కెట్ లో భిన్నమైన మోడల్స్


లక్షెట్టిపెట్, పెన్ పవర్

రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత దడ పుట్టిస్తుంది. క్షణం సేపు కూలర్... ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో లక్షెట్టిపెట్ పట్టణ వాసులు వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూలర్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ ఖర్చు చేయాలేని వారు తక్కువలో వచ్చే కూలర్లు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతున్నారు. ప్రస్తుతం వేసవి సమీపించడంతో పట్టణంలో కూలర్ల,ఏసీల దుకాణాల వైపు జనాలు పరుగులు పెడుతున్నారు. కూలర్ల లో బ్రాండెడ్ కంపెనీలతో పాటు లోకల్ గా తయారు చేసినవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ స్థాయి వారు ఆయా కూలర్లను కొనుగోలు చేస్తున్నారు.కస్టమర్లు అభిరుచికి తగినట్లుగా ఆయా కంపెనీలు కూలర్లను బిన్నంగా తయారు చేస్తున్నారు.చూడడానికి బాగుండడంతో పాటు ఒక్కో కంపెనీ ఒక్కో ఫీచర్ ప్రత్యేకంగా అందిస్తుంది.కస్టమర్లు ఎవరికి నచ్చిన కూలర్లును వారు కొనుగోలు చేసుకుంటున్నారు.దింట్లో సింఫోని, ఆవేల్స్, విగార్డ్, కెన్ స్టాన్, కంపెనీలతో పాటు లోకల్ గా తయారు చేసే కూలర్లు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు లభ్యమైతే బ్రాండెడ్ కూలర్లు రూ.6 వేల నుంచి రూ.16,500 వరకు లభిస్తున్నాయి. పట్టణంలో ఉన్న దుకాణాల్లో కలిపి ప్రతీ రోజు 20, నుంచి 30 కూలర్ల విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...