Followers

బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన

 బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన

పెన్ పవర్ , మల్కాజిగిరి 

గత మూడు రోజుల ముందు హుజూర్ నగర్ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఐ.పి.ఎస్. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, స్వేరోలను కులం పేరుతో దూషించి కార్యకర్తలతో దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మిర్జల్ గూడ చౌరస్తాలో (టి.ఎస్.పి.ఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ఆనంద్ ఆధ్వర్యంలో ప్లకార్డు పట్టుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్వేరోలకు బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ ఆనంద్ మాట్లాడుతూ గురుకులల ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్న ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పై కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం  అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో విద్యార్థిని జాహ్నవి, నర్సింగ్ రావు, మైత్రినాథ్, బిక్షపతి, జై భీమ్ రామచంద్రన్, పటేల్ నర్సింగ్, నర్సింగ్ రావు, అమర్, అరుణ్ కుమార్, కుమార్ షను, మనోజ్, ఇంతియాజ్, కవిత, లీలావతి, ఉపేందర్, ఎమ్మార్పీఎస్ రామచందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...