ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు
చెన్నూరు , పెన్ పవర్
జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన దుర్గం రఘునాథ్ గత 7 సంవత్సరాలుగా సామాజిక సేవలో భాగంగా నిరుపేదలకు అన్నదానం నిత్యవసర సరుకులను అందిస్తూ రక్తదానం అవయవ దానం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్త దాతలను పంపడం వంటి సేవలు చేస్తున్నందుకు మంగళవారం ఢిల్లీలో పూర్వర్ అచీవర్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో దుర్గం రఘునాథ్ కు బాలీవుడ్ నటుడు కునాల్ సింగ్ రాజ్ పుథ్ చేతుల మీదగా ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం రఘునాథ్ మాట్లాడుతూ, నిరుపేదలకు సేవ చేసినందుకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment