పక్షి ప్రేమికురాలు గంధం రిషిత-వేసవి కాలంలో పక్షుల దాహం తీరుస్తున్న రిషిత--రిషిత ని పలువురు ఆదర్శంగా తీసుకోవాలి
లక్షెట్టిపెట్,పెన్ పవర్
పట్టణానికి చెందిన గంధం రిషిత పక్షుల పట్ల చాలా మక్కువ చూపుతుంది.వేసవి కాలం రాగానే రోజు ఉదయాన్నే లేచి తన ఇంటి డాబా పై పక్షులకు నీళ్లు,పక్షులు తినే గింజలు వేస్తు పక్షుల ఆకలి తీరుస్తుంది.వేసవికాలంలో నీళ్లు దొరకక పలుచోట్ల పక్షులు మరణిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా పక్షులు అంతరించి పోతున్నాయి. చిన్న తనంలోనే పెద్ద మనస్తత్వం కలిగి ఉండడం రిషిత గొప్పతనం గత నాలుగు సంవత్సరాల నుండి వేసవికాలం ప్రారంభం కాగానే పక్షులకు క్రమం తప్పకుండా రోజు ఉదయాన్నే లేచి పక్షులకు నీళ్లు పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా చదువులో ముందంజలో ఉంటూ ఇలా ముగజీవుల పట్ల శ్రద్ద చూపిస్తుంది. అటూ రిషిత తండ్రి గంధం సత్యనారాయణ కూడా పలు సేవా కార్యక్రమాలు చెపడుతూ పలువురికి అదర్శనంగా నిలుస్తున్నారు.గత ఐదు సంవత్సరాల నుండి గంధం సత్యనారాయణ గిరిజన గ్రామములైన తాండలలో గిరిజన నిరుపేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.తండ్రి బాటలో కూతరు రిషిత కూడా సేవ కార్యక్రమంలో ముందు ఉంటుంది. ఈ తండ్రి కూతుర్లను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment