Followers

బీజేపీ పార్టీ బలోపేతంలో యువ మోర్చా కీలక పాత్ర

 బీజేపీ పార్టీ బలోపేతంలో యువ మోర్చా కీలక పాత్ర


భీమిని, పెన్ పవర్

 భీమిని మండలంలో ఆడాల గ్రామంలో భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షుడు ధోని సాయి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన యువ మోర్చా మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ఆడిచర్ల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం యువతకు చేస్తున్న అన్యాయాన్ని మరియు పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పార్టీ బలోపేతానికి భారతీయ జనతా యువ మోర్చా కీలక పాత్ర పోశించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గంధం దశరథం మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తునందున, రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో  లక్షణ్, అమిత్ సింగ్, తిరుపతి, సాయి, ప్రమోద్, నాగేష్, రమేష్, శేఖర్, శంకర్ పలుగురు కార్యకర్తలు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...