మహిళ కమిషన్ చొరవతో ఇంటికి చేరిన కోవిడ్ బాధితురాలు...
ఇంద్రవెల్లి, పెన్ పవర్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లోని తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలెగూడ గ్రామానికి చెందిన బాలిక కు ఇటీవల కోవిడ్ నిర్దారణ కావడం తో పేపర్లో వచ్చిన కథనం ప్రకారం పొలంలో ఉన్నట్టు వార్తను చూసి చలించిన మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి మంగళవారం వెళ్లి బాధితురాలిని పరమర్శించారు. బాధితురాలితో మాట్లాడిన ప్రకారం గత వారం రోజుల క్రితం తను చదువుతున్న ముధోల్ గురుకులం లో పిల్లలందరికీ కోవిడ్ పరీక్షలు చేయడంతో పాజిటివ్ నిర్దారణ కావడంతో గురుకులం నుండి నేరుగా పొలానికి వచ్చి సేద తీరుతునట్లు తెలిపారు. పొలంలో జొన్న పంట ఉండగా జొన్న కు కాపలాగా అమ్మ నాన్నలు పొలంలో ఉండడంతో ఇంటిదగ్గర ఒంటరిగా ఉండలేక తానే స్వయంగా పొలంలో తల్లిదండ్రుల తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నట్లు తెలిపారు. మీడియా లో ఒంటరిగా ఉన్నట్లు వచ్చిన వార్త తప్పని తెలిపారు. గ్రామస్తుల చొరవతో స్థానిక వైద్యాధికారి ఎప్పటికప్పుడు పరిశిలనలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కాగా ఈరోజు డాక్టర్ నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ అని తేలడంతో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలతో బాలిక తల్లిదండ్రుల తో మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి మాట్లాడి అందరిని ఒప్పించి అమ్మాయిని ఇంటికి పంపించారు. డాక్టర్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట స్వేరోస్ జిల్లా అధికార ప్రతినిధి ఉపారపు సత్యరాజ్ ఉన్నారు.
No comments:
Post a Comment