Followers

ప్లవనామ సంవత్సర పంచాగాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీకాంతేంద్ర స్వామి, సీఐ మన్మోహన్​

ప్లవనామ సంవత్సర పంచాగాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీకాంతేంద్ర స్వామి, సీఐ మన్మోహన్​

నిత్యం భగవంతుని ఆరాధనతో సుఖసంతోషాలు కలుగుతాయి.. 

శ్రీశ్రీశ్రీ గాయత్రి పీఠాధిపతి శ్రీకాంతేంద్ర స్వామి..

పెన్ పవర్,  మల్కాజిగిరి

ప్లవనామ సంవత్సర కాలం ప్రతి ఒక్కరు నిత్యము దైవారాధనచేస్తూ సుఖసంతోషాలతో ఉండాలని గాయత్రి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శ్రీకాంతేంద్ర స్వామి అన్నారు. మంగళవారం జమ్మిగడ్డ నివాసి రాళ్లబండి లంకేశ్వర చార్యులు రచించిన ప్లవనామ (2021–2022) సంవత్సర పంచాగాన్ని జీఆర్​ఎస్​ఎస్ ఫంక్షన్​ హాల్లో​ శ్రీకాంతేంద్ర స్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  కుషాయిగూడ ఇన్​స్పెక్టర్​ మన్మోహన్​, ఎస్​ఐ అనంతాచారిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతేంద్ర స్వామి మాట్లాడుతూ 2021, 2022 సంవత్సర కాలంలో కొంత ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తే విధంగా గోచరిస్తుందని, అయినా ప్రతి ఒక్కరు నిత్యం ఆ భగవంతుని ఆరాధిస్తే సమస్యలు పరిష్కారం సులభతరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్​ చారి, రాళ్లబండి భార్గవా చారి, పబ్బోజు సాయిబాబా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...