ఆడబిడ్డలందరికి పెద్దన్న కేసీఆర్
లక్షెట్టిపెట్, పెన్ పవర్పేదింటి అడబిడ్డలందరిని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నాల అందుకుంటున్నారు అని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు.పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పట్టణంతో పాటు మండలంలోని లబ్ధిదారులకు మంజూరు అయిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏ ప్రభుత్వాలు చేయని పనులు దేశంలో ఎక్కడా లేని కొత్త కొత్త సంక్షేమ పథకాలు పెట్టి తెలంగాణ రాష్టంను అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుపోతున్నారన్నారు. గతంలో ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులు తలబాదుకునే రోజులు ఉండేవని కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆడబిడ్డ పెండ్లికి తన వంతుగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకలు పెట్టి లక్ష రూపాయలు పైగా ఇవ్వడం జరుగుతుందన్నారు.ఏ రాష్టంలో లేని పథకం ఈ కళ్యాణ లక్ష్మి పథకం అన్నారు.బిడ్డ పుట్టిన నుండి చదువు పెండ్లి ఉదోగ్యం వరకు అడ్డబిడ్డలకు అనుకోని రీతిలో పథకాలు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని మన టీఆర్ఎస్ పార్టీది అన్నారు.ఒక కళ్యాణ లక్ష్మి కాకుండా రైతు బీమా,కుల వృత్తులను ప్రోత్సహించడం ఎన్నో పథకాలు పెట్టి రాష్టంను అంచలంచలుగా ముందుకు తీసుకుపోతుంటే గిట్టని పార్టీలు లేని పోనీ మాటలు అనడం సరికాదన్నారు. మాటలు జరుతున్న నాయకులకు ప్రజలు దేవుడే బుద్ది చెబుతారన్నారు.అనంతరం సుమారు వందుకు పైగా చెక్కలను లబ్దిదారులకు అందజేశారు.ఈ డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగన్న, జెడ్పిటిసి ముత్తె సత్తయ్య,మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంత్తయ్య,వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ కమిటీ చెర్మన్ సంధ్యాజగన్మోహన్ రెడ్డి,తహసీల్దార్ రాజుకుమార్,డిప్యూటీ తహసీల్దార్ హరిత,కౌన్సలర్లు ఒరగంటి శ్రీకాంత్,మెట్టు కళ్యాణిరాజు,చాతరాజు రాజన్న,వివిద గ్రామాల సర్పంచ్లు ఎంపిటిసి లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment