Followers

సుంకరి పేట రోడ్డు ప్రమాదం దురదృష్టకరం

సుంకరి పేట  రోడ్డు ప్రమాదం దురదృష్టకరం 

 విజయనగరం,పెన్ పవర్

విజయనగరం మండలం లోని  సుంకరి పేట జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని ఏఎంసీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, లోకల్ గవర్నెన్స్ జాతీయ ఉపాధ్యక్షులు మామిడి అప్పలనాయుడు అన్నారు. సోమవారం నాడు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మీడియా తో మాట్లాడారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం  ఇ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది అన్నారు.  రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొనడం ఈ ప్రమాదం జరగడం సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్పందించారన్నారు. హుటాహుటిన టెలిఫోన్లో వైద్యులకు తగిన ఆదేశాలు ఎమ్మెల్యే కోలగట్ల ఆదేశించారు అని అన్నారు.  తాము ఆస్పత్రికి వచ్చి  పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నా మన్నారు. మొత్తం రెండు బస్సులలో కలిపి 43 మంది ప్రయాణికులు ఉన్నారని రెండు బస్సులకు చెందిన డ్రైవర్లు ఇరువురు మృతి చెందడం బాధాకరమన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ కు చెందిన మరో ప్రయాణికులు మృతి చెందారన్నారు. గాయపడిన 23 మంది ప్రయాణికులను జిల్లా కేంద్రం వైద్యశాలకు  తీసుకు వచ్చారన్నారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విశాఖ కేజీహెచ్కు తరలించా రన్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించే విషయంలో ఎమ్మెల్యే కోలగట్ల తరఫున వైద్యులకు తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వైద్యులు సైతం సత్వరమే స్పందించి చికిత్స అందిస్తున్నా రాన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో డీసీఎంఎస్ డైరెక్టర్ కెల్ల త్రినాథ్, కెల్ల శ్రీను తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...