Followers

ఉత్తమ లీగల్ అడ్వైజర్ అవార్డు అందుకున్న న్యాయవాది

 ఉత్తమ  లీగల్ అడ్వైజర్ అవార్డు అందుకున్న న్యాయవాది

ఎల్లారెడ్డిపేట , పెన్ పవర్

 ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన న్యాయవాది ఉచ్చిడి శరత్ రెడ్డి  ప్రపంచ మానవ హక్కుల కౌన్సిల్ ఉత్తమ లీగల్ అడ్వైజర్ అవార్డును శనివారం అందుకున్నారు. ప్రపంచ మానవ హక్కుల కౌన్సిల్ సౌత్ ఇండియా అవార్డు 20 21  కార్యక్రమంలో లో భాగంగా  హైదరాబాదులోని జయ ఇంటర్నేషనల్ హోటల్ లో శనివారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్  ఎం ఆర్  ఆన్సారి మరియు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ముజాహిద్దీన్ చేతుల మీదుగా అడ్వకేట్ ఉచ్చిడి శరత్ రెడ్డి కి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆడ్వకేట్ ఉచ్చిడి శరత్ రెడ్డి మాట్లాడుతూ మానవ హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ప్రతి మనిషి జీవితంలో స్వేచ్ఛ హక్కు అనేది ఎలా ఉంటుందో మానవ హక్కులు కూడా అలాగే ఉంటాయన్నారు. ప్రపంచంలో ఎవరైనా నష్టం కలిగిస్తే మానవహాక్కు చట్టం  ద్వారా ప్రశ్నించే   అవకాశం ఉంటుందన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...