ఉద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్.. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
తార్నాక, పెన్ పవర్రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి సీయం కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారని హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. సోమవారం తార్నాకలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వ గౌరవప్రదమైన ఫిట్‌మెంట్ ప్రకటించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండి అనేక సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచి ఉద్యోగ, ఉపాధ్యాయ శ్రేయస్సుకు కట్టుబడిన ప్రభుత్వమని మరోసారి నిరూపించారన్నారని అన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాల పెంచి సీఎం తన పెద్ద మనసును చాటుకున్నారని తెలిపారు.
No comments:
Post a Comment