ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలి
ఇచ్చొడ, పెన్ పవర్మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన సిలమల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక మరియు రైతు ఆత్మహత్యల నివారణ కమిటి జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న తో పాటు సిపెల్లి రాజన్నతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవ వ్యవసాయ ఆర్థిక పెట్టుబడులు, దిగుబడులపై నిజానిర్దారణ చేయడం జరిగిందని,వాస్తవంగా తన బార్యపేరిట ఉన్న వ్యవసాయ భూమిని మరియు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండేవారని,కానీ గత 2, 3 సంవత్సరాల నుండి అనావృష్టి,అతివృష్టి ఉండడం మూలంగా మరియు ఈ సంవత్సరం నకిలీ విత్తనాలు వేసి ఆర్థికంగా కుంగిపోయి మనోవేదనకు గురై అప్పులు ఎలా తీర్చలో తెలియక ,ఒక పక్క పండించిన పంట చేతికి రాక,మరొక పక్క అప్పుల వాళ్ళు అడుగుతారని తానే భయంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఈ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన జిఓ నంబర్ 194 ప్రకారంగా 6 లక్షల రూపాయల పరిహరం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని కుటుంబ యజమానురాలికి నెలకు 5 వేల రూపాయల పెన్షన్ ఇచ్చి, పిల్లలపై చదువుల కోసం విద్య ,వైద్య సదుపాయాలు ఉచితంగా అందించాలని, నెలసరి ఆదాయం 15 వేల రూపాయలు ఉండే విదంగా చిరు ధాన్యాలను పండించే విదంగా ప్రోత్సహించాలని పంటలను అడవి జంతువుల నుండి రక్షించుకోవడానికి సామూహిక సోలార్ కంచెను ఏర్పాటు చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు తో పాటు జీవన భృతికి అవసరమయ్యే వ్యవసాయ పనిముట్లని అందించి ఆర్థిక భరోసాను కల్పించాలని ప్రభుత్వానికి ఈసందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అనిల్,ఆశన్న రాజన్న తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment