మావోయిస్టు కార్యకలాపాల తో సంబంధం ఉన్న వ్యక్తి అరెస్టు
పెన్ పవర్, క్యాతన్పల్లి
పట్టణ పోలీస్ స్టేషన్ లో రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, మంచిర్యాల డిసిపితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆదివారం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధి గద్దెరాడగిలో ఓ రెస్టారెంట్ నడుపుతున్న వ్యక్తి ఇంట్లో నమ్మదగిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గురిజాల రవీందర్ రావు గతంలో మావోయిస్టు కార్యకలాపాలలో పాల్గొని కోర్టులో లొంగిపోయాడని తెలిపారు. ఆదివారం అతని వద్ద నుండి మావోయిస్టు పార్టీకి సంబంధించిన వివిధ రకాల సాహిత్యంతో పాటు రెండు మెమోరీ కార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. రవీందర్ రావు క్యాతన్పల్లి గ్రామపంచాయితీగా ఉన్న సమయంలో సర్పంచ్ గా పనిచేశాడని తెలిపారు. 1978 సంవత్సరంలో యువకునిగా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణలో రాడికల్ యూత్ లో పనిచేసాడని అన్నారు. 1981లో సింగరేణి కార్మిక సమాఖ్యలో మొట్టమొదటి సెక్రెటరీ జనరల్ గా పనిచేశారని తెలిపారు. 1981 నుండి 1985 వరకు తన కార్యకలాపాలు నిర్వహించాడని, అనంతరం పోలీసులు పట్టుకునే సమయానికి లొంగిపోయినట్లు తెలిపారు. తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా ఉన్నట్లు తెలిపారు. ఆదివాసీల సంఘాలు, డిటిఎఫ్, విద్యా సంస్థలకు సంబంధించిన సంఘాలతో పాటు వివిధ సంఘాల పట్ల మావోయిస్టు భావాజాలాన్ని విస్తరింపచేసేవిధంగా ఉండేవాడని తెలిపారు. ఇది కొనసాగుతుండగా విస్తరాకు పేరిట హోటల్ వ్యాపారం మొదలు పెట్టినట్లు తెలియజేశారు. మొత్తంగా వృత్తికి, ప్రవృత్తికి ఎటువంటి సంబంధం లేకుండా అర్బన్ మావోయిజంగా పనిచేసినట్లు తెలియజేశారు. గత సంవత్సరం నవంబర్ లో మావోయిస్టు పార్టీలో పనిచేసే సెంట్రల్ కమిటి మెంబర్ వారణాసి సుబ్రహ్మణ్యం తో పాటు అతని భార్యకు 20 రోజుల పాటు షెల్టర్ ఇచ్చినట్ల తమ ఇన్విస్టిగేషన్లో తెలియజేసినట్లు పేర్కొన్నారు. అర్బన్ ఏరియాలో మావోయిస్టు భావాజాలాల వ్యాప్తిని కొనసాగించేవాడని తెలిపారు. అందుగకు గాను గురిజాల రవీందర్ ను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. చట్టపరంగా 120 సెక్షన్లతో పాటు వివిధ సెక్షన్లలో కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రహెమాన్, మందమర్రి సిఐ ఎడ్ల మహేష్, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సైకె. రవిప్రసాద్, కాసిపేట ఎస్సై రాములు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment