నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాలకు మోక్షం లేదా..
పెన్ పవర్ బ్యూరో,విశాఖపట్నంనాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాల్లో గిరిజనుల సమస్యలుకు ప్రభుత్వ పూర్తిగా మోక్షం కలిగించాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి,వెంకన్న డిమాండ్ చేసారు అయిన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు జిల్లా లోని నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో పోడు పారేస్టు భూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనులను ఆధికారులు ఆపీసులు చుట్టుతీప్పుతున్నారని తెలిపారు,మొదట 2020 ఆగస్టు తొమ్మిదో తేదీన ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ 11 మండలాలు తో పాటు నాన్ షేడ్యూల్డ్ఏరియా మండలాల్లో కూడా ఆదివాసులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు,
వీరితోపాటు నాన్ షెడ్యూల్ ఏరియా మండలాలు అయిన దేవరాపల్లి చీడికాడ వి ,మాడుగుల రావికమతం రోలుగుంట గోలుగోండ నాతవరం కోటవురట్ల నర్సిపట్నం మండలాల్లో వేలాది ఎకరాల్లో గిరిజనులు అటవీ ఫారెస్ట్ భూములు సాగు చేస్తున్నారని తెలిపారు విరికి అందరికీ సర్వే పూర్తి చేసిన పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు దీని వలన ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు స్కీములు అందడం లేదన్నారు దీంతో అనేక గ్రామాలకు రోడ్లు సౌకర్యాలు లేక ఆనారోగ్యంతో బాధపడుతున్నవారికి డోలి మోతలు తప్పడం లేదన్నారు,ఇప్పటికి పూరీగుడిసెల్లో మగ్గిపోతున్నారని తెలిపారు,ఐదవషేడ్యూల్ చేరుస్తామి గ్రామసభలు పెట్టి నీరుగార్చారని అన్నారు దీని వలన 1/70 చట్టం వర్థించక పోవడం గిరిజన భూములుకు రక్షణ లేకుండా పోవడం ఉద్యోగాల్లోను ఉపాధి అవకాశాలుకు దూరమోతున్నారని అన్నారు వెంటనే నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాల్లో సమస్యలుకు వెంటనే మోక్షం కలించాలని వెంకన్న డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment