సత్య సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
గోకవరం,పెన్ పవర్
మండల కేంద్రమైనగోకవరం గ్రామంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు సోమవారం సత్య సాయి బాబా సేవా సమితి అధ్యక్షులు తుమ్మలపల్లి చిట్టిబాబు ఆధ్వర్యంలో సనాతన ధర్మ ప్రబోధనా స్వచ్ఛంద సమితి కార్యనిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మండల వ్యాప్తంగా సుమారు 500 మంది పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందడంతోపాటు గా 70 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు మరియు 20 మందికి ఉచిత ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గోకవరం గ్రామ పెద్దలు దాసరి రమేష్ శ్రీరంగ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సమితి సభ్యులు దాసరి రమేష్ శ్రీరంగ దంపతులకు చిరు సత్కారం చేశారు.ఈ వైద్య శిబిరం నందు పాల్గొన్న వారందరికీ అక్షింతల రాజా రాణి దంపతులు భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తోట సాయిబాబు మాట్లాడుతూ మానవునికి అన్ని ఇంద్రియములు కంటే కళ్ళు ప్రధానమని అటువంటి కళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానవుడు సమస్త లోకాన్ని వీక్షించగలడని కళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది పేద వారికి ఉచిత వైద్య శిబిరం నందు మంచి వైద్యం అందించడం ద్వారా పేదవారికి ఉపయోగపడటం అనేది చాలా ఆనందంగా ఉందని మున్ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని అన్నారు.కార్యక్రమంలో బత్తుల వెంకన్నబాబు,కొత్తపల్లిసత్యనారాయణ కొర్రిపిల్లి అప్పలస్వామి,ఉంగరాల ఆదివిష్ణు,వేగి సాంబశివ, చెన్నంశెట్టి మహేష్, ,మంగరౌతుచందు,నక్కాపాండురంగ,పిల్లంగోరు పాపారావు, గండ్రేడ్డిసన్యాసిరావు,చందo వెంకటేశ్వరరావు, సింయాద్రి సత్యనారాయణ,పీతా గుణలక్ష్మి ,బత్తుల నానాజీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment