ముస్లిం మహిళ మృతి..అనాథగా మారిన చిన్నారి
సూర్యాపేట,పెన్ పవర్
సూర్యాపేట జిల్లా కేంద్రం 30వ వార్డులో ఒక అనాథ ముస్లిం మహిళ అనారోగ్యంతో మంగళవారం చనిపోయింది. ఆ మహిళకు చిన్న పాప అనాథ అయిన సందర్భం చూపరులను కంటతడి పెట్టించింది. 30వ వార్డు బీజేపీ కౌన్సిలర్ పలస మహాలక్ష్మి మల్సూర్ గౌడ్ చేరుకొని ఆ పాపను అక్కున చేర్చుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కి ,మున్సిపల్ సిబ్బందికి మరియు సఖి సిబ్బందికి విషయం తెలియజేసి వారి సహకారంతో చనిపోయిన మహిళ యొక్క చిన్న పాపని సఖి సెంటర్ కి అప్పగించారు. ఆ మహిళా శవాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సహకరించిన మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డికి మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసారు.
No comments:
Post a Comment