Followers

గురుకుల పాఠశాలను పరిశీలించిన సర్పంచ్

 గురుకుల పాఠశాలను పరిశీలించిన సర్పంచ్

పెన్ పవర్,తాడేపల్లిగూడెం

ఆరుగొలను గ్రామంలోని బాలయోగి గురుకుల పాఠశాలలోని విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆరుగొలను సర్పంచ్ పీతల బుచ్చిబాబు తెలిపారు సోమవారం గురుకుల పాఠశాలను పరిశీలించి,విద్యార్థులతో కలిసి బోజనంచేసారు, సమస్యలపై   విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా సర్పంచ్ పీతల బుచ్చిబాబు మాట్లాడుతూ గురుకుల పాఠశాల వసతి గృహంలో  విద్యార్థులకు, వసతి సక్రమంగా లేదని తెలిపారు.ఆహార, త్రాగునీరు పరంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు  స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సహకారంతో మండల స్థాయి విద్యాశాఖ అధికారుల సహకారంతో వసతి గృహంలోని సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు, జిల్లా స్థాయి గురుకుల పాఠశాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు, వసతి గృహంలో  సమస్యలు పరిష్కరించడానికి నావంతు సహకారం అందిస్తాన్నాని  తెలిపారు  ఈ కార్యక్రమంలో పంచాయతీ బోర్డు మెంబెర్స్ వీరమల్లు రాజేష్ బయ్యే ధనరాజ్,మొసలి ఉషారాణి,మద్డా డేవిడ్ రాజు,వీరమల్లు శీతరత్నం , మరియు గ్రామ నాయకులు బత్తిరెడ్డి రత్తయ్య అడపా సత్యనారాయణ ఖాథర్ బాబు చిక్కాల చిరంజీవి  వట్టూరి రాంబాబు అడపా వీరన్న మొసలి నాని మేళ్ళం గాంధీ రోబో తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...