కుక్కలను అదుపుచేయాలని కరప రైతులు, గ్రామస్తులు ఆందోళన
పెన్ పవర్, కరప
అడ్డు,అదుపు లేకుండా పెరిగిపోతున్న కుక్కలతో ఇబ్బందులకు గురవుతున్నామని, వాటిని అదుపుచేయాలని కోరుతూ కరప గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలో ప్రజలకు, పొలాల్లోని పసువులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల కాలంలో గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా అదికారులు పట్టించుకోకపోవడంతో రైతులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో సోమవారం పశువుల ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. ఇంటివద్ద పొలాల్లో ఉన్న పశువులను కరవడంతో పాడిగేదెలు, లేగదూడలు 12 వరకు మృతిచెందాయని రైతులు తెలిపారు. కుక్కకరచిన పశువులను పశువుల అసుపత్రికి తోలుకెలితే ఇంజక్షన్ కొనుక్కోమంటున్న అధికారుల తీరుకు రైతులు నిరన వ్యక్తంచేశారు. లక్ష విలువచేసే రెండు పాడిగేదెలు, నాలుగు లేగదూడలు కుక్కలు కరవడం వల్ల చనిపోయినట్లు రైతులు తెలిపి పశువులు అన్నింటికీ కుక్కకాటు ఇంజక్ల చేయాలని పట్టుపట్టారు. పశుసంవర్ధకశాఖ కరప సడివిజన్ ఏడీ డాక్టర్ కె.సురేష్ బాబు రైతులు ఆందోళన గురించి, ఆ శాఖ జేడికి ఫోన్ లో వివరించారు. కరప శివారు పేపకాయలపాలెం గ్రామాల్లో 1400 వరకు పశువులు ఉన్నాయిని వీటన్నిటికీ వారు రోజులు వ్యవదిలో ఒక్కొక్క పశువుకు మూడు దోసులు ఇంజక్షన్ న్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మంగళవారం నుంచి పశువులన్నింటికీ కుక్కకాటు ఇంజక్షన్లు వేయనున్నట్టు డాక్టర్ సురేష్ తెలపడంతో అందోళలనకారులు వెనుతిరిగారు. ఆందోళకారులు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకుని కుక్కలను అదుపు చేయాలని, మనుషుల,పశువుల ప్రాణాలు రక్షించాలని నినాదాలు చేస్తూ, ధర్నా చేశారు. చిన్నపిల్లలు, మహిళలు బయటకు వెళతుంటే కుక్కలు వెంటపడి కరుస్తున్నాయని కోళ్ల మేకలు, గొర్రెలు, పశువులు వేటినీ వదలడం లేదని వివరించారు.కుక్క కాటుకు గురైన భాదితులు పిహెచ్సీకి వెలితె అయిదుగురు (కుక్క కరచినవారు) వచ్చే వరకు వేచి ఉండమంటున్నారని, సిరంజీలు కొనుక్కోవాలంటున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసారు.
No comments:
Post a Comment