విద్యార్థినిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి...
వి.మాడుగుల,పెన్ పవర్విద్యార్థినిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని మాడుగుల జె ఎఫ్ సి ఎం మెజిస్ట్రేట్ శ్రీమతి అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల డిబేట్ కాంపిటీషన్ లో గెలు పొందినవారికి ఆమె మెరిట్ సర్టిఫికేట్ మెమొంటో లు బహూకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కౌమారదశలో అవగాహనతో అడుగులు వేయాలని సూచించారు. మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీతత్వం అలవర్చుకున్నాడు భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. విద్య పట్ల శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ పి రామారావు మహిళా పోలీసులు విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment