భారత్ బందులో పాల్గొన్న రైతు కార్మిక సంఘాలు
పెన్ పవర్, బయ్యారంమహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో వామపక్ష రైతు కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ విద్యార్థి యువజన పి డి ఎస్ యు మహిళా సంఘాలు పాల్గొన్నాయి. ఈక్రమంలో కొద్దిసేపు రహదారిపై రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డగించారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ జెడ్పిటిసి గౌని ఐలయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మధర్ సదానందం ఉప్పలయ్య వెంకన్న పాల్గొన్నారు.
No comments:
Post a Comment