Followers

కె.సి.ఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఏబీవీపీ

 కె.సి.ఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఏబీవీపీ





కూకట్ పల్లి, పెన్ పవర్ 

ఉద్యోగుల పదవి విరమణ వయస్సును యాభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కూకట్ పల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శవయాత్ర నిర్వహించి అనంతరం కూకట్ పల్లి బస్ స్టాప్ ముందు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష తొంభై వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనితో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కూకట్ పల్లి పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేసిన విద్యార్థులను అదుపులోకి తీసుకొని కూకట్ పల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈసందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ వినోద్ మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు నిరుద్యోగులను నిండా ముంచేలా వ్యవహరిస్తున్నారని, పెంచిన ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును వెంటనే రద్దు చేసి, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓవైపు సినిమా హాళ్లు, మరోవైపు బార్లు, వైన్ షాపులను తెరిచి ఉంచిన ప్రభుత్వం కేవలం విద్యా సంస్థలను మాత్రమే మూసివేయడం చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం విద్యాసంస్థలను తెరిపించి ఎన్నికల్లో విజయం సాధించగానే విద్యాసంస్థలను మూసివేసినట్లు ఉందని ఆరోపించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే తెరాస ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తునదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని లేని పక్షములో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు మురళీ, సనీల్, జమీల్, రాకేష్, రామకృష్ణ, నిఖిల్, మనోజ్, ప్రశాంత్, వేణు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...