Followers

విద్యార్థులు మానవతా విలువలు పెంపొందించుకోవాలి

విద్యార్థులు మానవతా విలువలు పెంపొందించుకోవాలి

సామర్లకోట, పెన్ పవర్

పాఠశాలల్లో పాఠ్యాంశాలతో పాటు గ్రంధాలయాల్లో జాతి నేతల జీవిత కథలను చదువుకోవడం ద్వారా విద్యార్ధులు మానవతా విలువలు పెంపొందించు కోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.  గ్రంధాలయాల్లో నిర్వహిస్తున్న చదవండ మాకిష్టం కార్యక్రమంలో సండేస్టోరీ పఠన కార్యక్రమాలను నిర్వహించారు. సామర్లకోట శాఖా గ్రంధాలయాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మద్యహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విచిత్ర హంస, పేదరాశి పెద్దమ్మ కధలు, పరిశోదన వంటి పుస్తకాల పఠన కార్యక్రమాన్ని విద్యార్థులతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూలు ఉపాద్యాయులు డివిఆర్ఎన్ వల్లీ, బేబీరాణి, లైబ్రేరియన్ ఎం శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...