ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడతా - పోసిన వీరేంద్ర కుమార్...
గండేపల్లి పెన్ పవర్
గండేపల్లి గ్రామంలో మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు పెనుగాడి సూరిబాబు అధ్యక్షతన ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పోసిన వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో ఫోటోగ్రాఫర్లు ఎంతో నష్టపోయారని వారిని ప్రభుత్వం అన్ని విధాలుగానూ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారి సంక్షేమానికి కృషి చేయడానికి అన్ని విధాల అందుబాటులో ఉంటానన్నారు. జిల్లాలో ఏ ఒక్క పేద ఫోటోగ్రాఫర్ మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అనేక ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం వెంటనే డబ్బులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా సహాయ నిధికి కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు . అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కోటేశ్వరరావు, నా మాన భాస్కర్, కోనే శ్రీను , రమణ, అప్పారావు , రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment