Followers

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు



మందమర్రి, పెన్ పవర్

తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం మందమర్రి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని యాపల్, రామన్ కాలనీలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలకు టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బి. సంజయ్ కుమార్ హాజరై, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆద్వర్యంలో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కొరకు పార్టీని స్థాపించి, స్థాపించిన 9నెలలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారన్నారు. పటేల్, పట్వారి వ్వవస్థను రూపుమాపడం తోపాటు, బీద ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారని కొనియాడారు. టీడీపీ హయాంలో సింగరేణి ప్రాంత అభివృద్ధికీ ఎంతోగానో కృషి చేసిందని, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీకీ దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, రాష్ట్ర మహిళ కార్యదర్శి ఎండీ షరీఫా, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు వాసాల సాగర్, పట్టణ అధ్యక్షులు కల్లేపల్లి సాగర్, నాయకులు సురేష్, సెగ్గం రవి, బైరాజు శ్రీనివాస్, బోర్లకుంట శ్రీనివాస్, మహిళ నాయకురాలు అనంతలక్ష్మీ, సమ్మక్క, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...