ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం
చిన్నగూడూర్, పెన్ పవర్స్థానికమండల కేంద్రంలోనిగ్రామ పంచాయితీ ఆవరణంలో సోమవారం ఘనంగాప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సేవ్ వాటర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కొమ్ము మల్లయ్య మాట్లాడుతూ... నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ప్రతి నీటి చుక్కను ఆదా చేసుకుని ముందు తరాలకు నీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ ఆవరణంలో సేవ్ వాటర్ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అజీమ్ జిపి సిబ్బంది, అంగన్ వాడి టీచర్స్ సుధ గాని కవిత, అన్ని, వరలక్ష్మి , గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment