Followers

అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

 అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.....టిఆర్ఎస్కెవి యూనియన్

పెన్ పవర్,మేడ్చల్

మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని సనాఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (శాంతబయోటెక్) కంపెనీలో  టిఆర్ఎస్కెవి అనుబంధ యూనియన్ సనాఫీ  హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ మాత్రమేనని దానికి అధ్యక్షులుగా మర్రి రాజశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారని టిఆర్ఎస్కెవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పి నారాయణ మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ప్రకటించారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని సనాపి హెల్త్ కేర్ ఇండియా  ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో టిఆర్ఎస్కెవి అనుబంధంగా ఉన్న యూనియన్  రిజిస్ట్రేషన్ నెంబర్ 48 యూనియన్ అధ్యక్షులుగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. టిఆర్ఎస్కెవి అనుబంధం పొందినది దీనికి గతంలో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా ప్రస్తుతం  యూనియన్ కి అధ్యక్షులుగా మర్రి రాజశేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ కొనసాగుతున్నారు. కానీ ఇటీవల కొంతమంది గులాబీ కలర్ జండా వాడుకొని మేము కూడా టిఆర్ఎస్కెవి అనుబంధమని తప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ కార్మికులను అయోమయం చేస్తున్నారు. మేము టిఆర్ఎస్కెవి గా దీన్ని మేము ఖండిస్తున్నామని నారాయణ తెలిపారు. కార్మికులు ఎవరు అయోమయానికి గురి కావద్దని మనది టిఆర్ఎస్కెవి యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 48 తప్ప  ఎలాంటి అనుబంధ సంస్థలు లేవని, దీనికి లేబర్ డిపార్ట్మెంట్  ఉందని కార్మికులు ఎవరు గందరగోళం పడవద్దని అలాగే కంపెనీ యాజమాన్యానికి మిగతా యూనియన్ యూనియన్ లో టిఆర్ఎస్కెవి అనుబంధ యూనియన్ గుర్తించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. లేబర్ డిపార్ట్మెంట్ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్  ఈరోజు లేఖ రాయడం జరిగిందని అన్నారు. టిఆర్ఎస్కెవి మిగతా అనుబంధ సంస్థ లేవీ లేవని మన నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకుల పై వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్కెవి అధ్యక్షుడు ప్రభాకర్, మున్సిపాల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, విష్ణుచారి, మాధవ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...