Followers

పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి

 పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్ నగర్, పెన్ పవర్

త్వరలోనే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు శిక్షణా తరగతులు కాగజ్ నగర్ లో టెట్ టిఆర్టీ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ , డిఎస్పీ కాగజ్ నగర్ టౌన్ లో  సోమవారం మార్చి 29 ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప పేర్కొన్నారు.. కాగజ్ నగర్ పట్టణం కౌటాల మండలంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్ టిఆర్టీ శిక్షణా శిబిరంలోని అభ్యర్థులకు కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో  ఏడు సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను అందజేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాబోయే ఏప్రిల్ నెలలో పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.. మన ప్రాంత విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశ్యంతో సుదూర ప్రాంతాల నుండి అత్యుత్తమ ఫ్యాకల్టీని తీసుకువచ్చి మన ప్రాంతంలోనే శిక్షణ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.. అనంతరం అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ ను ఎమ్మెల్యే అందజేశారు.. విద్యార్థులు శ్రద్దతో ఉద్యోగ సాధనే లక్ష్యంగా శిక్షణా తరగతులకు హాజరయ్యారు - కలెక్టర్ రాహుల్ రాజ్  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. విద్యార్థులు ఎంతో శ్రద్దతో ఉద్యోగ సాధనే లక్ష్యంగా శిక్షణా తరగతులకు హాజరవడం జరిగిందని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కోన్నారు.. తెలుగు రాష్ట్రల్లోనే ఎంతో అత్యత్తమమైన అధ్యాపకులచే ఎమ్మెల్యే.  ఈ ప్రాంత యువతీ యువకులు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో శిక్షణ ఇప్పించారని,అభ్యర్థులు కూడా ఎమ్మెల్యే ఏదైతే ఆశయంతో శిక్షణ ఇప్పించారో వారి ఆశయాలకు అనుగునంగా శ్రద్దగా చదివి ఉద్యోగం సాధించాలని పేర్కోన్నారు.. త్వరలో నిర్వహించే పోలీస్ కోచింగ్ కు డిపార్ట్మెంట్ తరపున సహకారం-డిఎస్పీ బాలస్వామి  డిఎస్పీ బాలస్వామి ::- కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించే పో‌లీస్ శిక్షణా తరగతులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా వంతు సహకారం అందిస్తామని కాగజ్ నగర్ డిఎస్పీ బాలస్వామి  పేర్కొన్నారు.. ఎమ్మెల్యే  నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను మెటీరియల్ ను అందరూ సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించాలని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డిఎస్పీ బాలస్వామి ,అధ్యాపకులు శిక్షణ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...