Followers

వామ్మో.........పాములు బాబోయ్..!. పాములు.

 వామ్మో.........పాములు బాబోయ్..!. పాములు.


నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లోని గ్రామాలలో ఇటీవలి  కాలంలో పాములు చాలా సంఖ్యలో దర్శనం ఇస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే  సంఘటనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సరిగ్గా వారం రోజుల క్రితం మండలం లోని బ్రాహ్మణకొత్తపెల్లి గ్రామ అంగన్వాడీ సెంటర్లో నలభై ఐదు పాము పిల్లలు బయటపడి పిల్లలను, తల్లిదండ్రులను గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసిన సంఘటన పాఠకులకు తెలిసిందే.ఈ సంఘటన మరువకముందే  అలాంటి సంఘటనే మునిగలవీడు గ్రామంలోని దొమ్మరిగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ మైబెల్లి ఇంటి ఆవరణలో ఆదివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో  ఒక్కసారిగా యాబై వరకు పాము పిల్లలు ప్రత్యక్షమైనాయి. దీనితో ఇంటిలోని మరియు కాలనీలోని  వారందరు  భయబ్రాంతులకు గురయ్యారు. ఇంతలో అదే కాలనికి చెందిన వార్డ్ మెంబెర్ పాషా, మాజీ ఉపసర్పంచ్ ఉప్పరబోయిన లక్ష్మణ్, యగ్గెమ్ యాకన్న కాలనీవాసులు కలసి వాటిని హతమార్చారు. ఈ సంగతి తెలుసుకున్న గ్రామ బీజేపీ నాయకులు నల్లాని పాపారావు సంఘటన స్థలానికి చేరుకొని ఆ కాలని వారికీ తగు జాగ్రత్తలు సూచించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...