ఆటో బోల్తా నలుగురు గర్బిణిలకు గాయాలు
పెన్ పవర్, విశాఖపట్నం
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా అందుబాటులో ఆసుపత్రి ఉన్న గైనిక్ లేక గర్బిణి లకు శ్యాపంగా మారింది.అరకువేలి 150 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో గైనికాల్జిస్ట్ లేనందున నలుగురు గర్భిణులు నెలవారి చెకాప్ లకోసం 50 కి.మీ దూరంలో ఉన్న పాడేరు హాస్పిటల్ కు ఆటోలో వెళ్తున్నారు.ఆ సమయంలో సంతారి జంక్షన్ వద్ద ఆటో ప్రమాదానికిగురైంది.నలుగురు గర్బిణి లకు ఆటో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు సహాయంతో హుకుంపేట హాస్పిటల్ కు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం పాడేరు హాస్పిటల్ కు తరలించారు. అరకువేలి 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గైనికాల్ జిస్ట్ వైద్యులు లేకపోవడం తో గిరిజన గర్బిణి లు నానా అవస్థలకు గరౌతున్నారు.సోమవారం అరకువేలి మండలం చినలబుడు పంచాయతీకి చెందిన చినలబుడు,కరయిగూడ,తురాయిగూడ గ్రామానికి చెందిన గిరిజన గర్భిణులు అరకువేలి నుండి పాడేరు ప్రభుత్వ హాస్పిటల్ లో నెలవరి చెక్ అప్ కోసం ఆటోలో వెళుతుండగ ప్రమాదవశాత్తు పెదగరువు,కోట్నపల్లి సంతారీ జంక్షన్ వద్ద ఉదయం 10 గంటల సమయంలో ఆటో బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో బి.మాలతి( 25) 7 నెల గర్బిణి కి కడుపులో దెబ్బతగిలింది.పి.హిందు(20) 6నెలలు.ఎస్.సీత( 22) 6 నెలలు.పొత్తంగి దనకుమారి( 21) 5 నెలలు గర్భిణులకు దెబ్బలు తగిలాయి. గర్భిణులకు చెక్ అప్ కు తీసుకు వెళుతున్న కె.లైకోన్ కి కూడా గాయపడ్డారు. గిరిజనఅరకువేలి ప్రభుత్వ హాస్పిటల్ లో గర్భిణులకు వైద్య నిపుణులు లేనందున ఆటో మాట్లాడుకుని అరకువేలి నుండి పాడేరు హాస్పిటల్ లో 50 కి మీ దూరం వెళ్లే దారిలో ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ జరిగింది. అరకువేలి నుండి పాడేరు హాస్పిటల్ కు వెళ్లి చికిత్స తీసుకుంటున్న గర్భిణులకు కనీసం అంబులెన్స్ కుడా ఏర్పాటు చేయకపోవడం పట్ల సీపీఎం నాయకు రాలు ఎస్.హైమావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు అంబులెన్స్ ద్వార వెళ్ళిఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అరకు నుండి పాడేరు హాస్పిటల్ కు చికిత్స కు వెళ్లే గర్భిణులకు ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్.
No comments:
Post a Comment