మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం..
పెన్ పవర్,కందుకూరురాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టి మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నదని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని డి ఆర్ ఆర్ విజ్ఞాన్ భవన్ (యుటిఎఫ్ కార్యాలయం) లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీలకు విద్య, ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీరియల్స్ లో స్త్రీ లను అవమానకరంగా చూపిస్తున్న మనమే వాటిని ప్రోత్సహించటం బాధాకరమన్నారు. అనేక ప్రచార మాధ్యమాలు మహిళలను కించపరిచే విధంగా సమాజంలో వారి స్థాయి తగ్గించే విధంగా ఉన్నాయని అయినప్పటికీ మహిళా సంఘాలు ఎందుకు పోరాటం చేయడం లేదో అర్థం కాలేదన్నారు. మహిళలు లేనిదే ఏ రంగం లేదని మహిళలను వ్యాపార రంగం కింద చూడడం దారుణమని అన్నారు. బలహీనతలను అధిగమిస్తే మన పాత్ర బలంగా ఉంటుందని అన్నారు. సమాజంలో స్త్రీలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారని అన్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న మహిళలను సమాజంలో ఎందుకు చులకనగా చూడ బడుతున్నారు, ఎందుకు చూస్తున్నారు బేరీజు వేసుకోవాలి అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మాట్లాడిన మాటలు ఆచరణలో పెడితే మహిళా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని అన్నారు. పురుషులు అహంభావాన్ని చూపిస్తే మహిళలు కుటుంబ గౌరవం నిలబెట్టే విధంగా చూస్తారని అన్నారు. నేటి తరం పొందలేనిది రేపటి తరం పొందే విధంగా కృషి చేయాలని అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, నివేశన స్థలాలు తదితర పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లెనీన, వీరమ్మ, ఉషశ్రీ, సరోజిని, పద్మజ సుమారు 150 మంది మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment