Followers

ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలి

 *ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలి

ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారిధి రెడ్డి గెలుపు ఖాయం.*

ఖమ్మం,పెన్ పవర్



మార్చి 14న జరగబోయే ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు బలపర్చిన సీనియర్ జర్నలిస్టు బి. జయసారధి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యదిక మెజారిటితో గెలిపించాలని కోరుతూ మంగళవారం ఖమ్మం నగరంలో టూటౌన్ ఏరియా లో గల ఎమ్మెల్సీ ఎన్నికల 284,85,86,87,88, 89,90,91, పోలింగ్ కేంద్రాల్లో గల ఓట్లు కలిగిన పట్టభద్రులను సిపిఐ, సిపిఎం పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కలిసి ఓట్లు అభ్యర్ధించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేసి అమలు చేయలేదని. బ్యాంకులను, ఎలైసీ, బొగ్గు గనులను, విశాఖ ఉక్కుతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవైటు దారులకు కారుచౌకగా కట్టబెడుతున్నది. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ లకు మంగళం పాడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కార్మికులను, పెట్టుబడి దారులకు కట్టుబానీసలను చేసింది. నీళ్ళు, నిధులు, నీయామాకలు అని చెప్పి అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగులకు పీఆర్సీ. ఇవ్వలేదని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వాళ్ళను పర్మినెంట్ చేయలేదు.అంగన్వాడీ ఉద్యోగులకు పనిభారం పెంచారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.తెలంగాణ విభజన చట్టం ప్రకారం ఈ ప్రాంతానికి రావాల్సిన ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం స్థాపన కోసం కనీస ప్రయత్నాలు జరపలేదని తీవ్రంగా విమర్శించారు. చట్ట సభల్లో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలని కుట్రపన్నుతున్నారు. బిజేపి, టిఆర్ఎస్ పార్టీలు పట్టభద్రులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. శాసన మండలిలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నించే శక్తి సామర్థ్యాలు కలిగిన సీనియర్ జర్నలిస్టు బి.జయసారధి రెడ్డి కే మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు యానాల సాంబశివరెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై. విక్రం, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మేకల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కె. సతీష్ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి వెంకట్ కుమార్, సిపిఐ నగర నాయకులు వి. రమణ, సిపిఎం నగర నాయకులు గంటా బీమయ్య, సదానందం,సి.హెచ్. వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...