నెల్లికుదురు పి హెచ్ సి లో నలభై ఐదు సం.పై వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
నెల్లికుదురు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు.స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారందరికీ కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం మండల వైద్యాధికారి వేదకిరణ్ ప్రారంభించగా స్థానిక ఎంపీపీఎర్రబెల్లి మాధవి నవీన్ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీపీ దంపతులు ఎర్రబెల్లి మాధవి,నవీన్ రావులు టీకాలు వేయించుకున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా బారినుంచి తప్పించుకోవడానికి వ్యాక్సినేషన్ చేయించు కోవడమే శ్రీరామరక్ష అన్నారు. డాక్టర్ వేద కిరణ్ మాట్లాడుతూ..నలభై ఐదు సంవత్సరాలు పైపడినవారందరూ పీహెచ్ సి కి వచ్చి టీకాలు తీసుకోవచ్చన్నారు. మొదటి డోసు టీకా తీసుకున్న తర్వాత ఇరవై తొమ్మిది రోజులకు రెండవ డోసు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి, సూపర్వైజర్లు, ఏ.సక్రి, సిహెచ్ మంగమ్మ, జి. రవి ఏఎన్ఎంలు డి. రోజ, కె. రోజా రమణి వైద్య సిబ్బంది, అశోద భాస్కర్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment