కొవ్వూరు మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
పెన్ పవర్, కొవ్వూరు
బుధవారం జరిగే పురపాలక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల పరిశీలకులు శ్రీకేష్ లత్కర్ ఐఏఎస్ పేర్కొన్నారు.కొవ్వూరు లోని సంస్కృత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా జరగడానికి పటిష్టమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు.పట్టణంలోని పది వార్డులకు 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.సమస్యాత్మక కేంద్రాలుగా పదింటిని గుర్తించామన్నారు ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును విలువైనదిగా భావించి తప్పనిసరిగా వినియోగించుకోవాలి అన్నారు.గత గ్రామ పంచాయతీలో జిల్లాలో 82% ఓటింగ్ ను నమోదు చేయడం విశేషమన్నారు. అదే పోలింగ్ శాతాన్ని మించేలా పురపాలక ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.పోలింగ్ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి, పురపాలక కమిషనర్ కె. టి. సుధాకర్, వివిధ శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు.
No comments:
Post a Comment