గిరిజన గురుకుల పాఠశాల/కళాశాలను తిరిగి ఇంద్రవెల్లికి తెప్పించాలి
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు డిమాండ్
ఆదిలాబాద్,పెన్ పవర్ఇంద్రవెల్లి మండలంలోని గిరిజన గురుకుల పాఠశాల కోసం తుడుం దెబ్బ ఆదివాసీ నాయకులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంద్రవెల్లి మండలంలో గత నాలుగేండ్ల కిందట గిరిజన గురుకుల పాఠశాల, రెషిడెన్షియల్ కళాశాల మంజూరైయింది.ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ లో ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది.నాలుగేండ్లు గడుస్తున్న ఆ భవనం ఇంకా పూర్తి కాలేదు.ఆ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇదివరకే పలుమార్లు తమకు ఇతర చోటా ఇరుకు గదులు మరియు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు ధర్నాలు చెపట్టారు.గతెడాది లాక్ డౌన్ కన్న ముందే ఈ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న మావల మండల కేంద్రంలో ఎర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు అక్కడే చదువులు కొనసాగించారు.
లాక్ డౌన్ అయిన తరువాత ఇప్పుడిప్పుడే పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఇప్పుడు విద్యార్థులు ఇంద్రవెల్లి నుండి ఆదిలాబాద్ కు వెళ్ళాలంటె అక్కడ సైతం వారికి తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోందని, ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన ఈ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలను ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి తరలించడంపై ఏజెన్సీ ఆదివాసీ గిరిజనులు మండిపడుతున్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ ఆద్వర్యంలో విలేఖరుల సమావేశం ఎర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ మాట్లాడుతూ గత నాలుగేళ్ల కిందట ఇంద్రవెల్లి మండలంలో మంజూరైన గిరిజన గురుకుల పాఠశాల మరియు రెసిడెన్షియల్ కళాశాల భవనం నాలుగేళ్లు గడుస్తున్న భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇంద్రవెల్లికి చెందిన గిరిజన గురుకుల పాఠశాల ,కళాశాలను ఇక్కడి ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలోని మావల మండల కేంద్రానికి తరలించడం పట్ల విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించి వెంటనే తిరిగి ఇంద్రవెల్లి మండలంలో గిరిజన గురుకుల పాఠశాల కళాశాలను కొనసాగించెలా చర్యలు తిసుకోవాలని లేనిపక్షంలో ఇంద్రవెల్లి నుండి ముత్నూర్ వరకు ఆదివాసీ గిరిజనులంత కలిసి రోడ్డు దిగ్బందం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మెస్రం నాగనాథ్, మాజీ ఎటిడబ్లయూఎసి చైర్మెన్ సిడాం భీంరావ్, ఇంద్రవెల్లి ఎంపిపి పోటేశోభా, ఇంద్రవెల్లి మాజీ సర్పంచ్ కొరెంగ సుంకట్ రావ్, ఆదివాసీ నాయకులు తొడసం నాగోరావ్, మెస్రం జైవంత్, గెడం భారత్ , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment