నగర పాలక ఎన్నికలలో లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఫలితాలు
విజయనగరం,పెన్ పవర్నగర పాలక ఎన్నికలలో లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఫలితాలు సాధించడం లో క్రియాశీలక పాత్ర పోషించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరియు డిప్యూటీ మేయర్గా ప్రకటించడం పట్ల అభినందన వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నాడు పూల్ బాగ్ లో వేంచేసియున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్త కర్రీ వెంకట రమణ సిద్ధాంతి, ఆలయ కమిటీ సభ్యులు కోలగట్ల శ్రావణికి శాలువా కప్పి ఉచిత రీతిన సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషిస్తూ , ఆశీర్వచనం చేశారు. కోలగట్ల శ్రావణి ని కలిసిన వారిలో ఆలయ కమిటీ సభ్యులు బేతా కృష్ణారావు, సముద్రాల నాగరాజు, కూర్మా రావు, జగదీష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment